గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (16:42 IST)

లడి లడి హిట్.. అంతా మెగాస్టార్ స్ఫూర్తి.. రోహిత్ నంద‌న్ అదుర్స్

Rohit Nandan
నో ఐడియా ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం యంగ్ హీరో రోహిత్ నంద‌న్, ఇంటర్నెట్ సెన్సేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ జంట‌గా రూపొందిన ల‌డిల‌డి అనే పాట తాజాగా విడుద‌లై అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌క‌లు నుంచి విశేషాద‌ర‌ణ అందుకుంటుంది. ఈ మాసీ నెంబ‌ర్ ని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు శ్రీచ‌ర‌ణ్ పాకాల కంపోజ్ చేశారు, అలానే బిగ్ బాస్ 3 విన్న‌ర్, హ్యాపేనింగ్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ ఈ పాట‌ను ఆల‌పించారు. 
 
ప్ర‌స్తుతం ఈ పాట య్యూటూబ్‌తో పాటు ఇత‌ర సంగీత మాధ్య‌మాలు ద్వారా శ్రోత‌ల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ సంద‌ర్భంగా యువ న‌టుడు రోహిత్ నంద‌న్ మాట్లాడుతూ తాను మెగాస్టార్ చిరంజీవిగారిని ఆద‌ర్శంగా తీసుకుని డాన్స్, న‌ట‌న త‌దిత‌ర సినిమా విభాగాల్లో శిక్ష‌ణ తీసుకున్న‌ట్లుగా తెలిపారు. లాక్ డౌన్ స‌మ‌యంలో త‌న స్నేహితుడు శ్రీచ‌ర‌ణ్ పాకాల‌తో క‌లిసి ఈ ల‌డిల‌డి అనే పాటకు సంబంధించిన కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేసి ఆ త‌రువాత ఆయ‌న సూచ‌న‌లు ద్వారా ఈ ఆల్బ‌మ్‌లోకి ఇంట‌ర్నెట్ సెన్షేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ను, ప్ర‌ముఖ సింగ‌ర్ రాహుల్ సిప్లీగంజ్ ని, తీసుకున్నామ‌ని అన్నారు రోహిత్ నంద‌న్ అన్నారు. 
 
ఈ పాట‌ను ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘు మాస్ట‌ర్ త‌న డాన్సింగ్ స్కిల్స్ తో, లిరిక్ట్ రైట‌ర్ విస్సాప్ర‌గ‌డ త‌న రైటింగ్ తో మ‌రో లెవెల్ కి తీసుకెళ్లార‌ని, ఈ పాట ద్వారానే ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తెలుగు చిత్రీ సీమ‌లోకి అడుగుపెట్టార‌ని, ఆమె ఈ పాట‌లో ఆడ‌ట‌మే కాదు పాడ‌టం కూడా జ‌రిగంద‌ని రోహిత్ తెలిపారు. 
 
తొలిసారిగా తాను చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని తెలుగు ఆడియెన్స్ విశేషంగా ఆద‌రించ‌డం, యూట్యూబ్‌లో ఈ పాట‌కు మిలియ‌న్ పైగా వ్యూస్ రావ‌డం తన‌కు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని రోహిత్ నంద‌న్ తెలిపారు. తాను త్వ‌ర‌లోనే హీరోగా ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడితో తెలుగు చిత్ర సీమ‌లోకి ఎంట్రీ ఇస్తున్నాని రోహిత్ అన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌ణ త్వ‌ర‌లోనే రాబోతుంది.
 
నటీనటులు:
రోహిత్ నందన్, ప్రియా ప్రకాష్ వారియర్
టెక్నికల్ టీం:
కొరియోగ్రఫీ, దర్శకుడు: రఘు మాస్టర్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
లిరిక్స్: విస్సాప్రగడా
సింగర్: రాహుల్ సిప్లిగంజ్