శనివారం, 18 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 12 జనవరి 2021 (09:17 IST)

swami vivekananda ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత వుంటే అంత మంచిది: స్వామి వివేకానంద

1. పవిత్ర జీవనం గడిపేవారు మాత్రమే పరమాత్మ దర్శనం చేయగలరు.
 
2. భౌతికసంపదకు, నైతిక పురోగతికి మధ్య అభిలషణీయమైన సమతుల్యం ఉంటేనే వ్యక్తికి శాంతి, సమాజానికి అభ్యుదయం చేకూరుతుంది.
 
3. భయపడవద్దు... జాగరూకతతో పనిలో నిమగ్నం కండి. గమ్యం చేరుకునేంతవరకూ ఆగవద్దు.
 
4. పరిపూర్ణ అంకిత భావం. పవిత్ర, అతిసునిశితమైన బుద్ది, సర్వాన్ని జయించగల సంకల్పం- వీటిని కలిగిన కొద్దిమంది వ్యక్తులు పని చేసినా మెుత్తం ప్రపంచంలో పెనుమార్పు సంభవిస్తుంది.
 
5. ప్రతిఘటన, వ్యతిరేకత ఎంత ఉంటే అంత మంచిది. ప్రతిఘటన లేనిదే  నదికి వేగం వస్తుందా... ఒక విషయం ఎంత క్రొత్తదైతే, ఎంత మంచిదైతే ప్రారంభ దశలో అది అంత వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యతిరేకతే విజయ సూచకం. ప్రతికూలత ఎక్కడైతే ఉండదో అక్కడ విజయం కూడా ఉండదు.
 
6. ప్రజలు మనల్ని మంచివారంటారు. చెడ్డవారంటారు. కాని ఆదర్శాన్ని ముందుంచుకొని సింహాలలా మనం పనిచేయాలి.
 
7. ఈ ప్రపంచం ఒక గొప్ప వ్యాయామశాల. ఇక్కడికి మనం రావడం మనల్ని మనం బలవంతులుగా చేసుకోవడానికే.
 
8. సత్సంకల్పం, నిష్కాపట్యం మరియు అఖండ ప్రేమ అనేవి ప్రపంచాన్ని జయించగలవు. ఈ సుగుణాలు ఉన్న ఒక్క వ్యక్తి లక్షలకొద్ది కపటుల, పశు సమానుల కుతంత్రాలను నశింపచేయగలదు.
 
9. అంతర్వాణి ప్రబోధమును అనుసరించి వ్యక్తి పని చేయాలి. అది యోగ్యమైనది, న్యాయమైనది అయితే సమాజము తన ఆమోదాన్ని తెలుపవలసిందే. కాకపోతే అది ఆ వ్యక్తి మరణించిన కొన్ని శతాబ్దాల తర్వాత కావచ్చు.
 
10. యువకులై, ఉత్సాహవంతులై , బుద్ధిమంతులై , ధీరులై మృత్యువును సైతం పరిహసించగలిగి, సముద్రాన్నయినా ఎదురీదడానికి సంసిద్దులైన వారికి విశ్వాసం ఉంటే సర్వమూ సమకూరతాయి.