గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (13:36 IST)

మెగాస్టార్ సరసన సోనాక్షి సిన్హా...

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ఆచార్య విడుద‌ల గురించి ఎదురుచూస్తున్న చిరు.. మోహ‌న్ రాజా డైరెక్ష‌న్‌లో తెర‌కెక్క‌బోతున్న లూసిఫ‌ర్ రీమేక్‌లో న‌టించ‌నున్నాడు. ఈ మూవీ త‌ర్వాత బాబీ సినిమా మొద‌లుపెట్ట‌నున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించ‌నుంది. ఇందులో చిరు సరసన బాలీవుడ్ భామ నటించనుంది. మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేష‌న్‌లో సినిమా వస్తున్న విష‌యం తెలిసిందే. 
 
ఈ ప్రాజెక్టుపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులోనే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించనుంది. బాబీ టీం సోనాక్షి సిన్హాను సంప్ర‌దించ‌గా.. సినిమాలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 
 
త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా ఉండబోతుంద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఎమోష‌న్ అండ్ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌లో ఆస‌క్తిక‌ర క‌థాంశంతో కూడిన స్క్రిప్ట్‌కు ఇంప్రెస్ అయిన చిరంజీవి త‌నంత‌ట తానుగా బాబీ సినిమాను చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.