శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (16:38 IST)

బిగ్ బాస్ షోకి కరోనా సెగ... కంటెస్టెంట్స్‌లో ఇద్దరికి పాజిటివ్

సినీ అభిమానులకు పాత రోజులు వచ్చేశాయ్. థియేటర్లు, సరికొత్త టీవీ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రాంతో అలరిస్తుండగా, సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్-5 షో కూడా ప్రారంభం కానుంది. 
 
అయితే గత ఏడాది మాదిరిగానే బిగ్ బాస్ షోకి ఈసారి కూడా కరోనా సెగ తాకింది. బిగ్ బాస్-5 కంటెస్టెంట్స్‌లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. 
 
ప్రస్తుతం వారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే ఈసారి చాలా కొత్తగా బిగ్ బాస్-5 షో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారట.