గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి

మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా మారిన సమంత భర్త..?

Mahesh_Chaitu
అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా మారాడు. ఇదేంటి అనుకుంటున్నారా? అయితే చదవండి. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కొత్త చిత్రం 'థాంక్యూ' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 
 
విక్రమ్ కె కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం అబిడ్స్‌లోని రామకృష్ణ సినిమా హాల్‌లో జరుగుతుండగా.. చైతుపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 
 
అయితే చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో చైతు మహేశ్‌బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు అభిరామ్‌గా కనిపించనున్నాడు. అభిరామ్ పేరు పేరిట, మహేష్ బాబు పోస్టర్లతో థియేటర్ ప్రాంగణంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇది చైతు అభిమానులతో పాటు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు అభిమానులకు శుభవార్తే. 
 
ఇకపోతే.. బీవీఎస్‌ రవి సమకూర్చిన కథను దర్శకుడు విక్రమ్‌ కే కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా.. అవికా గోర్‌ మరో కథానాయికగా కనిపించనుంది. చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.