శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 4 జనవరి 2021 (14:42 IST)

మహేష్ బాబుకి వొదినగా నటిస్తున్న రేణూ దేశాయ్

ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కీలక పాత్ర పోషిస్తారని గతంలో ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రంలో రేణు దేశాయ్ పాత్ర ధృవీకరించబడిందని, మహేష్ బాబుకి వొదిన పాత్రలో రేణు నటిస్తుందని టాలీవుడ్ సినీజనం టాక్.
 
ఈ చిత్రం బ్యాంక్ మోసాలు నేపధ్యంలో తెరకెక్కుతోంది. మహేష్ బాబు స్పోర్ట్స్ బ్యాంక్ మేనేజర్‌గా నటిస్తున్నాడని టాక్. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఈమె కూడా బ్యాంక్ ఉద్యోగి పాత్రను పోషిస్తున్నారు.
 
మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది.