సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (19:10 IST)

బుట్టబొమ్మకు స్టెప్పులు.. మహేష్ బాబు డైలాగులు.. వార్నర్ అదుర్స్

David Warner
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టేసిన ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అప్పటి నుంచి టాలీవుడ్ హీరోల డైలాగులు, పాటలతో వీడియోలు చేస్తున్నాడు. డేవిడ్ వార్నర్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన డైలాగులతో ఇన్‌స్టాలో హోరెత్తించాడు వార్నర్. 
 
ఈ ఏడాది అల్లు అర్జున్ వీడియోతో తన వీడియోల పరంపరను మొదలు పెట్టిన వార్నర్.. మహేశ్ బాబు వీడియోతో 2020కి బై చెప్పాడు. మహేశ్ బాబు సినిమా ‘మహర్షి’ సినిమాలోని సీన్లకు రీఫేస్ యాప్‌తో తన ఫొటో పెట్టి మహేశ్‌లా కనపడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. 
 
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో యాప్ సాయంతో మహేష్ బాబులా కనబడ్డాడు. స్కూటర్‌పై వెళ్తుండడం, ‘ఓడిపోవడం అంటే నాకు భయం’ అని డైలాగులు చెబుతుండడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.