ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు
నల్గొండ జిల్లాలో ఓ వివాహిత తను కావాలన్నప్పుడల్లా కోర్కె తీర్చడం లేదని హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జానుత్తుల గ్రామంలో 32 ఏళ్ల జ్యోతికి అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపి వైద్యుడు మహేష్‌తో వివాహేతర సంబంధం వుంది. ఐతే ఇటీవల జ్యోతి జీవనోపాధి నిమిత్తం మిర్యాలగూడలో నివసిస్తోంది. ఐతే అప్పుడప్పుడు తన స్వగ్రామమైన జానుత్తలకు వస్తుండేది. ఈ క్రమంలో ఇద్దరూ ఏకాంతంగా గడిపేవారని సమాచారం.
ఐతే ఈమధ్య కాలంలో జ్యోతి పూర్తిగా మిర్యాలగూడలో వుంటూ తనకు దూరం వుండాలని మహేష్‌కు ముఖం మీదే చెప్పేసింది. దీనితో తీవ్ర ఆగ్రహం చెందిన మహేష్, అదేమీ కనిపించనీయకుండా... తనకోసం ఆఖరిసారి రావాలనీ, ఆ తర్వాత తను డిస్టర్బ్ చేయనంటూ బ్రతిమాలాడు. అతడి మాటలను నమ్మిన జ్యోతి వచ్చింది. దాంతో ఆమెపై అత్యాచారం చేసాడు. అనంతరం ఆమెను దేవరకొండ నుంచి కారులో తీసుకువెళుతున్న క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. దీనితో తనతో తెచ్చుకున్న గడ్డి మందును ఆమె గొంతులో బలవంతంగా పోసి తాగించాడు.
ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఐతే ఆమెను తీసుకుని కారులో వేగంగా వెళ్తున్న మహేష్‌ను రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించారు. అతడి వాలకం అనుమానాస్పదంగా వుండటంతో వెంబడించి కారు ఆపి లోపల పరిస్థితిని గమనించారు. అపస్మారక స్థితిలో వున్న జ్యోతిని వెంటనే దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా వుందని చెప్పడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె చనిపోయింది. కాగా మృతురాలికి ఇద్దరు పిల్లలు వున్నారు. తన భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మహేష్ ప్రయత్నించాడంటూ జ్యోతి భర్త, బంధువులు ఫిర్యాదు చేసారు. దీనితో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.