గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (13:13 IST)

రష్మిక మందన 2020లో అదరగొట్టేసిందిగా..?

కన్నడ భామ రష్మిక మందన.. హీరోయిన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై.. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో టాప్ డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ఈ ఏడాది సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. మరోవైపు నితిన్‌తో కలిసి నటించిన భీష్మ సినిమా మంచి విజయం సాధించింది. 2020 ఏడాదిని కరోనా మహమ్మారి కుదిపేసిన సంగతి తెలిసిందే. లక్కీగా లాక్ డౌన్‌కు ముందే రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
 
అసలు సినిమాలే కరువైన 2020లో అందరి హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉన్నా రష్మిక మాత్రం ఏడాదికి సరిపోయేంత సక్సెస్‌ను అందుకుంది. ఈ భామ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న పుష్పలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక మరోవైపు ఇదే సంవత్సరం బాలీవుడ్‌లోకి కూడా అడుగపెడుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమైంది. సిద్దార్థ్ మల్హోత్రా లీడ్ రోల్ చేస్తున్న చిత్రంతో బాలీవుడ్ తెరంగేట్రం చేస్తోంది రష్మిక.
 
తద్వారా ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి హీరోయిన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది రష్మిక. ఈ ఏడాది హి ఈజ్ సో క్యూట్ అంటూ రష్మిక డ్యాన్స్ చేసిన పాట సూపర్ హిట్టయింది. మరోవైపు మీకు అర్థం అవుతుందా అంటూ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో చెప్పే డైలాగ్ మీమ్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయింది.