బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (17:51 IST)

శేఖర్ కమ్ముల త‌ర‌హాలో ల‌వ్‌స్టోరీ వుంటుందిః నారాయణదాస్, రామ్మోహన్ రావు

Narayanadas, Rammohan Rao
సినిమా పుట్టిన‌ప్ప‌టినుంచీ ల‌వ్‌స్టోరీలు పుడుతూనే వుంటాయి. ప్రేమ‌కున్న ప‌వ‌ర్ అటువంటిది. ప్ర‌తి సినిమాలోనూ ప్రేమ‌కథ వుంటుంది. తెలుగులో ప్రేమాభిషేకం ఎంత బాగుందో తెలిసిందే. త‌మ‌కూ అటువంటి ల‌వ్‌స్టోరీలంటే ఇష్టం. ఇప్పుడు మేం తీసిన ల‌వ్ స్టోరీ శేఖర్ కమ్ముల త‌ర‌హాలో వుంటుంది` అని చిత్ర నిర్మాత‌లు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు తెలియ‌జేశారు.
 
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందించిన `లవ్ స్టోరి` సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ "లవ్ స్టోరి" కావడం విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారని నిర్మాత‌లు పేర్కొన్నారు.
 
ముందుగా నారాయణదాస్ నారంగ్ మాట్లాడుతూ, మేము ఎన్నోఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సెక్టార్ లో ఉన్నా ఎప్పుడూ నిర్మాణం గురించి ఆలోచించలేదు. మాకు ఉన్న అనుభవంతో మిగతా సెక్టార్స్ లో రాణించినా, నిర్మాణం అనేది కొత్త విషయం. ఇక్కడ డబ్బుతో పాటు అనేక విషయాలు ఆధారపడి ఉంటాయి. టీమ్ వర్క్ లా పనిచేయాలి. క్రియేటివిటీ చూపించాలి. అలా ప్రొడక్షన్ గురించి కూడా అవగాహన వచ్చాక నిర్మాణ రంగంలో అడుగుపెట్టాం. లవ్ స్టోరి సినిమా గతేడాది విడుదల చేయాల్సింది. లాక్ డౌన్ వల్ల వాయిదా వేస్తూ వచ్చాం. ఇప్పుడు థియేటర్ లలో సినిమాను విడుదల చేస్తున్నందుకు థ్రిల్ గా ఫీల్ అవుతున్నాం. లవ్ స్టోరి మంచి ఎమోషన్స్ ఉన్న ఫీల్ గుడ్ మూవీ. థియేటర్ లలోనే ఇలాంటి సినిమాలను ఎంజాయ్ చేయగలం. అందుకే ఓటీటీలు ఎన్ని సంప్రదించినా మా చిత్రాన్ని ఇవ్వలేదు. అన్నారు.
 
మ‌రో నిర్మాత పుస్కూర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ, నారాయణదాస్ నారంగ్ గారు గత 30 ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సెక్టార్ లో యాక్టివ్ గా ఉన్నారు. 100కు పైగా థియేటర్స్, 10 మల్టీప్లెక్సులు రన్ చేస్తున్నారు. నేను కూడా చాలా ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలో ఉన్నాను, ఆ తర్వాత నిర్మాతగా మారాను. నారాయణదాస్ నారంగ్ గారితో కలిసి ఫస్ట్ టైమ్ లవ్ స్టోరి సినిమాను నిర్మించాం. ఇకపై మరిన్ని చిత్రాలు కలిసి నిర్మించాలని అనుకుంటున్నాం. కరోనా లాక్ డౌన్ వల్ల లవ్ స్టోరి వాయిదా వేస్తూ వచ్చాం. ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉంది. అందుకే థియేటర్ ల ద్వారా ఈనెల 24న లవ్ స్టోరి చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం. గత ఏప్రిల్ లో మా సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం. కానీ అదే టైమ్ లో పవన్ కళ్యాణ్ `వకీల్ సాబ్` సినిమా రిలీజైంది. దాంతో మా చిత్రాన్ని వాయిదా వేశాం. లవ్ స్టోరి చిత్రంలో పాటలు చాలా హిట్ అయ్యాయి. శేఖర్ కమ్ముల గారి తరహా కథా కథనాలు సినిమాలో చూస్తారు. ఆయన స్టైల్ లోనే కొత్త కథను చూపించబోతున్నారు. అదేవిధంగా ఏపీలో థియేటర్ ల టికెట్ ధరలు, బుకింగ్ విధానం, ఇతర విషయాలపై ప్రభుత్వంతో సంప్రదించేందుకు సిద్ధంగా ఉన్నాం. త్వరలో ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ని కలవబోతున్నాం’’ అన్నారు.