గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (21:20 IST)

ఒక్క ట్వీట్‌తో రూమర్లకు ఫుల్‌స్టాఫ్ పెట్టిన నాగచైతన్య (video)

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య తన వైవాహిక జీవితంపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాఫ్ పడింది. తన భార్య, హీరోయిన్ సమంతతో నాగ చైతన్య తెగదెంపులు చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఈ పుకార్లు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. వీటికి ఒకే ఒక్క ట్వీట్‌తో ఫుల్‌స్టాఫ్ పెట్టారు. ముఖ్యంగా, నాగ చైతన్య కొత్త చిత్రం 'లవ్ స్టోరీ' ట్రైలర్ ఎండ్ కార్డ్ వేసింది. 
 
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. విశేష స్పందన తెచ్చుకుంటున్న ఈ ట్రైలర్ మీద చైతన్య సతీమణి సమంత ట్వీట్ రూపంలో స్పందించారు. చైతూ ట్వీట్‌ని కోట్ చేస్తూ.. ''విన్నర్.. టీమ్ మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి ‘థ్యాంక్యూ సో మచ్’ అంటూ సాయిపల్లవి కూడా సమాధానం ఇచ్చింది. 
 
అయితే సమంత తన ట్వీట్‌‌లో సాయి పల్లవి‌ని మాత్రమే ట్యాగ్ చేసి నాగచైతన్య పేరుని మెన్షన్ చేయకపోవడంపై అందరిలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అక్కినేని అభిమానులు మాత్రం సామ్ ట్వీట్‌లో 'విన్నర్' అంటే చైతన్య అని.. చైతూ ట్వీట్‌నే రీట్వీట్ చేసినప్పుడు సెపరేట్‌గా మళ్ళీ ట్యాగ్ చేయాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేశారు. అయినప్పటికీ ఈ రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పడలేదు.
 
ఈ నేపథ్యంలో నాగచైతన్య ట్విట్టర్ వేదికగా పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తన సతీమణి సమంత ట్వీట్‌కు చైతూ తాజాగా రిప్లై ఇచ్చారు. ''థాంక్స్ సామ్'' అని చై తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో చై-సామ్ జంట మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. ఒక్క ట్వీట్‌తో అందరికీ సమాధానం దొరికిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.