గురువారం, 10 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 జులై 2025 (21:45 IST)

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

Husband_wife Fight
బెంగళూరులో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ భార్య హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని శ్రీనివాస్‌పూర్‌కు చెందిన హరీష్ కుమార్, పద్మజలు భార్యభర్తలు. ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. వీరిద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేసి, బెంగళూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 
 
అయితే చిన్నచిన్న విషయాలకే ఈ జంట తరుచూ గొడవపడేవారని, మంగళవారం రాత్రి కూడా ఇది మరింత తీవ్రంగా మారినట్లు పోలీసులు చెప్పారు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం కారణంగా కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన హరీష్‌కుమార్‌ తన భార్య పద్మజను కడతేర్చాడు. 
 
కోపంతో భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి..తొక్కి.. ఆమె ప్రాణం పోయేంత వరకు తొక్కి చంపాడు. ఈ ఘటన బొమ్మనహళ్లీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హరీష్‌ను అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నారు. కాగా మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.