సమంత స్నేహితురాలికి పెళ్లైపోయింది.. ఎవరు..?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు పలు సినిమాల్లో స్నేహితురాలిగా నటించిన విద్యుల్లేఖకు వివాహమైంది. ఈమె ప్రముఖ నటుడు మోహన్ రామన్ కుమార్తె. 'నీ దానే ఎన్ పొన్ వసంతం' అనే చిత్రంలో హీరోయిన్ సమంత స్నేహితురాలిగా నటించి, వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రం తెలుగులోనూ రిలీజైంది. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు సినిమాల్లో హాస్య నటిగా కనిపించింది.
ప్రస్తుతం విద్యుల్లేఖ తమిళంలో కంటే తెలుగులోనే పలు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా విద్యుల్లేఖ ప్రస్తుతం సంజయ్ వాట్వానీ అనే సింధు యువకుడిని పెళ్ళి చేసుకుంది. చెన్నై ఈసీఆర్ రోడ్డులో ఉన్న ఓ నక్షత్ర హోటల్‌లో వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య శనివారం జరిగింది. ఈ విషయం తెలిసిన అనేక మంది సినీ సెలెబ్రిటీలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంకా విద్యుల్లేఖ వివాహ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.