బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (15:29 IST)

మ‌గ‌వారికి హైకోర్ట్ శుభ‌వార్త‌: హర్యానా హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

లివింగ్ రిలేష‌న్ షిప్‌లో ఉన్న పురుషుడికి ర‌క్షణ క‌ల్పించాలంటూ పంజాబ్ మ‌రియు హైర్యానా హైకోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రిచింది. 2018 సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 (వ్యభిచారం) రద్దు చేయబడింది. 
 
భార్య క్రూరత్వం కారణంగా 21 కిలోల బరువు తగ్గిన శారీరక వికలాంగుడికి విడాకుల మంజూరు సబబేనని తెలిపింది పంజాబ్, హర్యానా హైకోర్టు. 50 శాతం వినికిడి లోపంతో బాధపడుతున్న ఆ వ్యక్తికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు హిసార్ ఫ్యామిలీ కోర్టు గతంలోనే తీర్పు చెప్పింది. అయితే ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ బాధితుడి భార్య దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. 
 
74 కిలోల నుంచి 53 కిలోల వరకు బరువు తగ్గిన బాధితుడు, అతడి కుటుంబంపై మహిళ దాఖలు చేసిన అన్ని క్రిమినల్ ఫిర్యాదులు, కేసులు అబద్ధమని కోర్టు తెలిపింది. ఇది మానసిక క్రూరత్వానికి సమానమని తీర్పులో పేర్కొంది. భార్య క్రూరత్వం కారణంగా బాధితుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కోర్టు గుర్తించింది.
 
కాగా త‌మకు ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ లివింగ్ రిలేష‌న్ షిప్‌లో ఉన్న ఓ జంట కోర్టును ఆశ్రయించ‌డంతో కోర్టు ఈ విధ‌మైన తీర్పును ఇచ్చింది. పంజాబ్ కు చెందిన ఓ జంట లివింగ్ రిలేష‌న్ షిప్ లో ఉన్నారు. అయితే రిలేషిప్ లో ఉన్న యువ‌కుడికి అప్ప‌టికే వివాహం జ‌రిగి విడాకుల‌కు అప్లై చేసుకోగా అత‌డి భార్య త‌ర‌పున‌ కుటుంబ స‌భ్యులు యువ‌కుడిపై బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు.  
 
దాంతో ఆ జంట కోర్టును ఆశ్రయించి త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోర‌టంతో కోర్టు ఈ విధ‌మైన తీర్పును ఇచ్చింది. పిటిష‌న‌ర్ జంట త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ పంజాబ్ హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో పాటు… సామ‌ర్ల పోలీస్ స్టేష‌న్‌లో ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరింది. 
 
పిటిష‌న‌ర్ త‌ర‌పున న్యాయ‌వాది దినేష్ మ‌హ‌రాజ‌న్ మాట్లాడుతూ.. తమ క్ల‌యింట్‌కు ఇప్ప‌టికే పెళ్లి కాగా విడాకుల కోసం అప్లై చేసుకున్నాడ‌ని దాదాపు విడాకులు కూడా ఖ‌రారు అయ్యాయ‌ని..దాంతో ప్ర‌స్తుతం త‌న‌కు నచ్చిన మ‌రో యువ‌తితో రిలేషన్ షిప్‌లో ఉన్నాడ‌ని తెలిపారు.