శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:47 IST)

దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో భర్త ఏం చేశాడో తెలుసా?

వారిద్దరూ భార్యాభర్తలు. కొన్ని సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపారు. కానీ, భార్య అనారోగ్యంబారినపడటంతో ఆమె కన్నుమూసింది. కరోనా కష్టాలకు తోడు ఆర్థిక కష్టాలు ఉన్నాయి. చివరకు భార్య అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితి. దీంతో భార్య మృతదేహాన్ని చద్దరులో చుట్టి చెరువులో పడేసేందుకు తీసుకెళ్ళాడు. అయితే, ఆ వ్యక్తిని కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.  ఆ వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్న, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హయత్ నగర్‌కు చెందిన శ్రీను అనే వ్యక్తి భార్య అనారోగ్యం కారణంగా మృతి చెందింది. అయితే, అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో భార్య మృతదేహాన్ని చెద్దరులో చుట్టి హయత్‌నగర్‌లోని బాతుల చెరువులో పడేసేందుకు తీసుకెళ్లాడు. 
 
అతన్ని స్థానికులు స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం చేరవేశారు. ఆ వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. మహిళ భర్త శ్రీనుతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
 
తన భార్య అనారోగ్యంతో మృతిచెందిందని, దహణ సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో మృతదేహాన్ని పడేసేందుకు తీసుకెళ్తున్నానని నిందితుడు శ్రీను చెప్పారు. మృతురాలి ఇంటిని పోలీసులు పరిశీలించారు. అనారోగ్యమా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు.