బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:28 IST)

ఆ రాతలు రోతపుట్టిస్తున్నాయి.. అలా ఎలా రాస్తారు?: విడాకులపై చైతూ కామెంట్స్

తన భార్య సమంత తాను విడిపోబోతున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై టాలీవుడ్ హీరో నాగ చైతన్య స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు రోత పుట్టిస్తున్నాయి.. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. 
 
శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించి నాగ చైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్‌స్టోరీ. శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నాగ చైతన్య తమ విడాకల రూమర్లపై స్పందించారు. 
 
కొన్నిరోజులుగా సోషల్ మీడియాతో సమంతతో చైతూ విడిపోతున్నాడని విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఇలా వస్తున్న పుకార్లను చూసి మొదట్లో కొద్దిగా బాధపడ్డాను. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు? అని వేదనకు గురయ్యేవాడిని. పాత రోజుల్లో మాస పత్రికలు ఉండేవని, వాటిలో ఓ వార్త రాస్తే నెలంతా అదే ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, కొద్దిసేపట్లోనే ఒక వార్తను తోసిరాజని మరో వార్త వచ్చేస్తోంది. 
 
ప్రజలు కూడా ఎన్ని వార్తలు వచ్చినా నిజాలనే గుర్తుంచుకుంటారన్న విషయం అర్థమైందని, అప్పటి నుంచి గాసిప్స్ గురించి పట్టించుకోవడం మానేశాను అని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. అయితే గాసిప్స్ కోసం తన పేరును వాడుకుంటుండుటం బాధాకరమని పేర్కొన్నాడు. ప్రతి వ్యక్తికి వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితం ఉంటాయని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. 
 
తన తల్లిదండ్రులను గమనించడం ద్వారా వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని విడివిడిగా చూడడం అలవర్చుకున్నానని తెలిపాడు. తన తల్లిదండ్రులు తమ పనులు ముగించుకుని వచ్చిన తర్వాత ఇంట్లో బయటి విషయాలు చర్చించుకోరని, వారి నుంచి తాను కూడా అదే దృక్పథాన్ని అలవర్చుకున్నానని చైతూ వివరించారు. ఆ విధంగ చైతూ తమ విడాకులపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.