గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (13:57 IST)

నాగ చైతన్య - సమంత పెళ్లి పెటాకులా? భరణంగా రూ.300 కోట్లు???

టాలీవుడ్ కపుల్స్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల వివాహం విడాకుల దిశగా పయనిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ అంశంపై టాలీవుడ్‌లో రసవత్తర చర్చ సాగుతోంది. దీంతో ఈ విడాకుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఈ ఇద్ద‌రి విడాకుల‌కు సంబంధించి ఎన్నో వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఇటు స‌మంత కాని అటు నాగ చైత‌న్య కాని స్పందించ‌క‌పోవ‌డంతో రోజు రోజుకి కొత్త వార్త‌లు పుట్టుకొస్తున్నాయి. కానీ.. ఇటు నాగ చైతన్య గాని, సమంత గాని ఈ వార్తలపై పూర్తిగా ఓపెన్ అయ్యింది లేదు. 
 
సమంత రోజుకో రకమైన ట్వీట్‌తో హింట్స్ ఇస్తున్నా, చైతూ వైపు నుండి ఆ మాత్రం ఇండికేషన్స్ కూడా లేవు. తాజాగా సమంత విడాకుల వెనుక కారణాలు, నాగ చైతన్య ఇచ్చే భరణం అంశాల గురించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.
 
మరోవైపు నాగచైతన్య 'లవ్ స్టోరీ' మూవీ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. కానీ.., ఆ ప్రమోషన్స్‌లో ఎక్కడా సమంత కనిపించడం లేదు. చైతూ కూడా ఈ విషయంలో మౌనంగానే ఉంటూ వస్తున్నాడు. 
 
మీడియా ముందుకి కూడా తన వ్యక్తిగత ప్రశ్నలు అడగకూడదు అన్న కండీషన్ మీదే వస్తున్నాడట. దీంతో.. భార్యభర్తల మధ్య గ్యాప్ రావడం నిజమే అని ఇండస్ట్రీ వర్గాలు, మీడియూ వర్గాలు, సాధారణ ప్రేక్షకులు అంతా ఫిక్స్ అయిపోయారు.