శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (08:48 IST)

బుర్ర, బుద్ధి లేదంటూ తిట్టిన సమంత దీనికైనా కూల్‌గా రియాక్ట్ అవుతుందా?

ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత-నాగచైతన్య గురించి విపరీతంగా గాలికబుర్లు తిరుగుతున్నాయి. ఇలాంటి గాలిగబుర్లకు సదరు కపుల్ స్టార్స్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయకపోవడంతో అవి మరింతగా ముదిరి పాకానపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. వాళ్లు ఎక్కడ కనబడితే అక్కడ ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు.

 
తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. సమంత అక్కినేని వేరుగా చెన్నైలో వుంటున్నట్లు ఆ వార్త సారాంశం. చైతు-శామ్ విడాకులు తీసుకోబోతున్నారనీ, అందువల్లే ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా వుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మొన్న తిరుమల వచ్చిన సమంతను ఓ విలేకరి విడాకుల గురించి ప్రశ్నించగా... నీకు బుర్రా బుద్ధి వుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సమంత.

 
ఇక ఇప్పుడు తాజాగా సమంత చెన్నైలోనూ, చైతన్య హైదరాబాదులో ఒంటరిగా వుంటున్నారన్న గాలికబురు తిరుగుతోంది. ఇందులో వాస్తవమెంత అన్నది తెలియాల్సి వుంది. అసలు ఇలాంటి గాలి కబుర్లకు ఈ ఇద్దరు స్టార్ హీరోహీరోయిన్లు ముగింపు ఎందుకు పలకడంలేదన్న వాదనలు వినబడుతున్నాయి. చూడాలి ఏం చేస్తారో?