గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 18 సెప్టెంబరు 2021 (20:02 IST)

తిరుమలలో విలేకరి విడాకుల ప్రశ్న, బుద్ధీ బుర్రా వుందా అంటూ సమంత ఆగ్రహం

అసలే స్టార్ హీరోయిన్. ఆపై ఈమధ్య విడాకులు అంటూ ఒకటే చర్చ. దీనితో సమంత, నాగచైతన్యలు ఎక్కడైనా కనబడతారా అంటూ ఎదురుచూసేవారు ఎక్కువయ్యారు. ఎందుకంటే.... అసలు విడాకులు అంటూ మీడియా కోడై కూస్తున్నా అటు సమంత కానీ ఇటు చైతన్య కానీ మౌనం వహిస్తున్నారు. దీనితో అక్కినేని ఫ్యాన్స్ మరింత ఆందోళన చెందుతున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... సమంత అక్కినేని మనశ్శాంతి కోసం శనివారం వేకువ జామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె వచ్చిందని తెలియగానే స్థానిక జర్నలిస్టులు చుట్టుముట్టారు. కొందరు మాస్కు తీయండి మేడం అని అడిగితే... మరికొందరు విడాకులపై ప్రశ్న సంధించేందుకు ప్రయత్నించారు. ఒక విలేకరి ఆమెకి వినబడేట్లు.. విడాకులు అనుకుంటున్నారు దీనిపై ఏం చెప్తారు మేడం అనేసరికి సమంత తీవ్ర ఆగ్రహానికి లోనయ్యింది. 
 
గుడికి వచ్చాను. ఇలాంటివి అడిగేందుకు నీకు బుద్ధుందా... అనడమే కాకుండా నీకు బుర్ర లేదంటూ తలపై చేయి పెట్టి సైగ చేస్తూ వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. దీనితో అక్కడి వారంతా అలాగే గుడ్లప్పగించి చూస్తూ వున్నారు.