శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 18 సెప్టెంబరు 2021 (11:22 IST)

తిరుమలలో తలదించుకుని వెళ్ళిపోయిన సామ్, ఏమైంది..?

నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో సామ్ ప్రత్యక్షమైంది. ఒంటరిగానే ఆమె తిరుమలకు చేరుకుంది. విఐపి విరామ దర్సనా సమయంలో స్వామివారిని సమంత దర్సించుకున్నారు. 
 
అయితే నాగచైతన్య విషయంపై మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమె తలదించుకుని వెళ్ళిపోయారు. ఆలయం ముందు నుంచి కారు ఎక్కేంత వరకు చాలామంది అభిమానులతో పాటు మీడియా ప్రతినిధులు సామ్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. 
 
అయితే ఏమాత్రం మీడియాతో మాట్లాడకుండా అభిమానులకు అభివాదం చేయకుండా తలదించుకునే వెళ్ళారు. సామ్ సామ్ అంటూ అందరూ పిలిచినా కూడా ఆమె పట్టించుకోలేదు. కెమెరాల ముందు చేతులు ఊపుతూ మాట్లాడనంటూ సైగ చేసుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళిపోయారు.
 
సమంత తిరుమలలో కనబడగానే విడాకులు తీసుకోవడానికి స్వామి ఆశీర్వాదం కోసం వచ్చిందా అంటూ భక్తులు మాట్లాడుకున్నారు. అయితే సమంతతో వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఆ మాటలు వింటూనే తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు.