మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (16:27 IST)

మళ్లీ పెళ్లికూతురైన సమంత... సాంప్రదాయ చీరకట్టులో మెరిసింది..

Samantha Akkineni
గత కొన్ని రోజులుగా సమంత, నాగ చైతన్యకు విడాకులు అంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తాజాగా పెళ్లి కూతురు లుక్‌లో దర్శనమిచ్చి సమంత  షాకిచ్చింది. సమంత తాజాగా సాంప్రదాయ చీరకట్టులో మెరిసింది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా ఫోటోషూట్‌లకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలలో సామ్ మావూరి సిల్క్స్ నుండి ఎరుపు, బంగారు బనారసీ చీరను కట్టుకుని అందంగా కనిపిస్తుంది. 
 
నటి ఈ చీరకు హాఫ్ స్లీవ్స్ బ్లౌజ్‌ ధరించింది. ఇందులో నెక్‌లైన్, బ్రోకేడ్ ఎంబ్రాయిడరీ ఉంది. జతిన్ మోర్ జ్యువెల్స్ బంగారు ఆభరణాలు వేసుకుంది. ఇంకా సాధనా సింగ్, కోడూరు అమర్‌నాథ్ సామ్ మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ చేశారు.
 
ఇదంతా చూస్తుంటే ఆమె ఏదో యాడ్ కోసం ఈ ఫోటోలు దిగినట్టు కన్పిస్తోంది. సామ్ అందమైన వధువు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ సామ్ తన పెళ్ళిలో కూడా దాదాపు ఇలాగే కన్పించింది. 
 
దక్షిణాది దివా సమంత రూత్ ప్రభు రియల్ ఫ్యాషన్ ఐకాన్ అన్న విషయం తెలిసిందే. ఆమె ఫ్యాషన్ అభిరుచి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంట్లో అయినా, ఈవెంట్‌లో అయినా ఆమే స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. ఈ సోషల్ మీడియా క్వీన్ తాజా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.