గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 30 ఆగస్టు 2021 (11:26 IST)

సమంతా అక్కినేని మింత్ర భారీ బ్రాండ్ అభియాన్‌: ఫ్యాషన్ కోషియెంట్ వృద్ధి

మింత్ర ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన తన స్టార్లతో కలిసి చేపట్టిన బ్రాండ్ అభియాన్‌లో భాగంగా తన బ్రాండ్ రాయబారి సమంతా అక్కినేనితో కలిసి తెరకెక్కించిన సరికొత్త వాణిజ్య ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఈ అభియాన్ ‘భారతదేశపు ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్’గా మింత్ర తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే లక్ష్యాన్ని కలిగి ఉండగా, తన సినిమాలు మరియు ఫ్యాషన్‌కు అద్భుతమైన ప్రశంసలు అందుకున్న వైవిధ్యమయమైన సూపర్‌స్టార్‌ను కలిగి ఉన్నాయి. మహిళల వెస్ట్రన్ వేర్ మరియు ఎథినిక్‌ వేర్‌లను ఉత్తేజించే రెండు వాణిజ్య ప్రచార చిత్రాల్లో దక్షిణాదిన ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారాలపై సమంతా కనిపించనున్నారు.
 
మింత్ర బ్రాండుకు అత్యంత ప్రతిభావంతమైన మరియు ప్రముఖ చలనచిత్ర నటి సమంతా ప్రతిరూపం కానున్నారు మరియు బ్రాండ్‌ను దక్షిణాది మరియు ఇతర ప్రాంతాల్లో నిరుడు మింత్రతో భాగస్వామ్యం ప్రారంభమైనప్పటి నుంచి తన విస్తృత శ్రేణి అభిమానులతో అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
 
నాలుగు సార్లు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని దక్కించుకున్న మరియు సమస్యలకు తక్షణమే స్పందించి విరాళాలు అందించి అందరి హృదయాలను గెల్చుకున్న ఆమె ఈ ప్రాంతంలోని పలు రాష్ట్రాల్లో ఇంటింటా అభిమానులను సంపాదించుకున్నారు మరియు ప్రాంతీయ భాషల్లో చలన చిత్రాల్లో అత్యంత ప్రశంసలు అందుకున్న పాత్రలు మరియు ఓటీటీలో ఆమె నటించిన సిరీస్‌లకు గుర్తింపు దక్కించుకున్నారు. వారి ఫ్యాషన్ కోషియంట్ మరియు దోషరహితమైన స్టైల్‌తో ఆమె స్థానిక ప్రేక్షకుల ఆదరణను పెంచుకున్నారు. ఇక్కడ మరియు ఇతర ప్రాంతాల్లో మింత్రను ఫ్యాషన్ కోసం ప్రతి ఒక్కరినీ ఆకర్షించే కేంద్రంగా చేసేందుకు మరింత సహకారాన్ని అందించనున్నారు.
 
కొత్త వాణిజ్య ప్రచార చిత్రాలు ప్రారంభంతో మింత్ర తన వినియోగదారులతో తన బలమైన సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు, లావాదేవీలను ప్రభావితం చేసేందుకు మరియు వేగాన్ని అందించేందుకు సిద్ధం కాగా, ఈ మార్కెట్‌లో తన నాయకత్వాన్ని మరింత శక్తియుతం చేసుకోనుంది.
 
బ్రాండ్ అభియాన్ గురించి
ఈ బ్రాండ్ అభియాన్‌ను సమాజంలోని అన్ని వలయాల్లో విస్తరిస్తున్న ఫ్యాషన్ ప్రియుల విస్తరిస్తున్న సముదాయానికి చేరేలా అభివృద్ధి చేసింది మరియు ఫ్యాషన్ పరిణితిని భారతదేశపు అత్యంత ప్రియమైన మరియు ప్రజాదరణ పొందిన ట్రెండ్ సెట్టర్ల మద్ధతుతో లభించేలా చేస్తుంది. ఈ అభియాన్ మింత్రను భారతదేశపు ఫ్యాషన్ పరిణితులుగా, సంక్షిప్తంగా ఉన్నప్పటికీ ఘనమైన సందేశాన్ని ఇవ్వడం ద్వారా వినియోగదారులకు నేరుగా, స్పష్టతతో మరియు స్మరణీయ టేక్‌ఎవే ‘అది ఫ్యాషన్ అంటే, అది మింత్ర’ అని తెలియజేస్తుంది.
 
అదనంగా ఈ సందేశం మింత్రను ప్రత్యేకంగా విభిన్నంగా నిలిపే మింత్ర స్టూడియో చుట్టూ ఉండగా, ఇది వినియోగదారులు స్ఫూర్తి పొందే మరియు భారతదేశంలోని టాప్ ఇన్‌ఫ్లయెన్సర్ల నుంచి కొనుగోలు చేసుకోదగిన ఫ్యాషన్ ఫీడ్ మరియు ఒక క్లిక్‌తో కొనుగోలు చేసుకోదగిన స్టూడియోను మింత్ర కలిగి ఉంది. మొత్తం మీద నిశ్చితమైన మరియు అడ్డంకులు లేని లావాదేవీలు మరియు రిటర్న్‌ల ద్వారా మిత్ర అది వాస్తవానికి ‘భారతదేశపు ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్’ అని  చూపిస్తుందో అలానే అది నిత్యం ఫ్యాషన్ అవసరాలను అర్థం చేసుకుంటుంది.
 
వాణిజ్య ప్రచార చిత్రాల గురించి
వాణిజ్య చిత్రాలోల ప్రేక్షకులు వారికి అత్యంత ఇష్టమైన నటి సమంతాను తమ మింత్ర బ్రాండ్ పర్సనలైజ్ చేసినట్లు చూపిస్తుండగా, వారు వైవిధ్యమయ నేపథ్యం మరియు అత్యాకర్షణీయమైన రూపాల ద్వారా బ్రాండ్ విలువ ప్రతిపాదనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. సమంతా పాశ్చాత్య మరియు ఎథినిక్ వేర్ దుస్తుల్లో ఆకర్షణీయంగా మరియు క్లాసీగా కనిపించగా, భారతదేశపు ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్‌గా మింత్ర బ్రాండ్‌ను వృద్ధి చేసే ఆశయాన్ని సమాజంలోని అన్ని వర్గాల ఫ్యాషన్ ప్రియుల విస్తరిస్తున్న సముదాయానికి చెందినదిగా నిలిచింది.
 
ఈ వాణిజ్య ప్రచార చిత్రాలు మింత్ర నుంచి కొనుగోలు చేసుకునే వారు దేన్ని నిరీక్షించవచ్చు అనే దాన్ని పలు రెట్లు వృద్ధి చేస్తుంది, అంటే జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న ఎథినిక్ మరియు వెస్ట్రన్ స్టైల్స్, సెలెబ్ లుక్స్ తదితరాలను కలిగి ఉండగా, మరింత ఎక్కువ కోరుకునే ఫ్యాషన్ ప్రియులకు ఏదీ ‘తగినది కాదు’ మరియు మిత్ర భారతదేశపు ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్‌గా ఇక్కడ మద్ధతు ఇస్తోంది! దీనితో ఈ వాణిజ్య ప్రచార చిత్రం మిత్ర అసాధారణ విక్రయ అనంతర సేవలైన మార్పిడి, వెనక్కు తిరిగి ఇవ్వడం మరియు రీఫండ్‌ను కూడా ప్రత్యేకంగా చూపిస్తుంది.
 
నూతన అభియాన్‌ను ప్రారంభించడం గురించి మింత్ర బ్రాండ్ ప్రచారకర్త మరియు సెన్సేషన్ సమంతా అక్కినేని మాట్లాడుతూ ‘‘నేను సుమారు ఒక ఏడాది నుంచి మింత్రతో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాను మరియు ఈ అనుభవం అత్యంత సంతృప్తికరంగా ఉంది. నాకు ఫ్యాషన్ అనేది నిత్య వ్యవహారంగా ఉండడంతో, గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో ప్రజలతో పాటు నేనూ నూతన లుక్ మరియు స్టైల్‌తో ప్రయోగాలు చేసేందుకు వేచి చూస్తున్నాను. మింత్ర ప్రజల ఫ్యాషన్ అవసరాలను అర్థం చేసుకునేందుకు మరియు అత్యాధునిక అభిరుచులను ఉంచే వారి సామర్థ్యంతో ఇది ఫ్యాషన్ గురించి అవగాహన ఉన్న ప్రజలకు అత్యవసరం అనిపించింది. కొత్త వాణిజ్య ప్రచార చిత్రాల్లో భాగమయ్యేందుకు మరియు నా అభిమానులను వారికి అత్యంత ఇష్టమైన స్టైళ్లకు చేరువ చేసేందుకు భాగమయ్యేందు చాలా సంతోషం కలిగిస్తుంది’’ అని పేర్కొన్నారు.
 
వాణిజ్య ప్రచార చిత్రాల విడుదల గురించి మింత్ర సీఎంఓ హరీశ్ నారాయణన్ మాట్లాడుతూ, ‘‘సమంతా తన ప్రతిభతో లక్షలాది మందిపై ప్రభావాన్ని చూపించారు మరియు వారి నటనా కౌశల్యం మరియు ఫ్యాషన్ ఎంపికలతో ప్రతి ఒక్కరికీ చేరువ అయ్యారు. వారి ఫ్యాషన్ అభిరుచి, ముఖ్యంగా దక్షిణాదిలో అపారమైన అభిమానులకు ప్రత్యేకంగా నిలిచారు మరియు యువత ఫ్యాషన్ ఎంపికలపై వారు చూపించిన ప్రభావం అసామాన్యమైనది. ఈ ప్రాంతంలో అందరి అభిమానాన్ని దక్కించుకున్న సమంతా ఇక్కడి ప్రేక్షకులకు మా ప్లాట్‌ఫారానికి తీసుకు రావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. వారిలా సామర్థ్యం ఉన్న నటి మింత్రకు ప్రతిరూపంగా నిలవడం భారతదేశపు ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్‌గా మిత్ర ఇమేజ్ మరియు దృష్టికోణాన్ని మరోసారి ధృవీకరిస్తుంది’’ అని వివరించారు. మింత్ర 360-డిగ్రీ విధానాన్ని అనుసరిస్తుండగా టీవీ, డిజిటల్ మరియు సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా దేశ వ్యాప్తంగా ఈ వాణిజ్య ప్రచార చిత్రాలను ప్రసారం చేయనుంది.