గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 15 జులై 2021 (19:52 IST)

మాన‌సిక రోగిగా ట్రీట్‌మెంట్ చేసుకున్న శ్రుతి హాసన్

Sruti-santa
శ్రుతి హాసన్ తన మానసిక ఆరోగ్య సమస్యల గురించి హృదయ విదారక విషయాలను వెల్లడించింది. తాను చిన్నతనంలోనే చికిత్సలో ఉన్నానని, ఒత్తిడిని ఎక్కువ‌గా ఫేస్ చేశానంటూ పేర్కొంది. త‌ర‌చు సోష‌ల్‌మీడియాలో ఏదోర‌కంగా షేర్ చేసుకునే ఆమె ఈసారి ఆరోగ్యం గురించి చెప్పుకొచ్చింది. ప్రియుడు సంతను హజారికాతో శ్రుతి హాసన్ ఒక గూఫీ వీడియోను పంచుకున్నారు; 'కలిసి తినే వారు కలిసి ఉంటారు` అంటూ బ‌య‌ట ఫుడ్‌ను ఇద్ద‌రూ తింటూ ఎంజాయ్ చేస్తూ వున్న ఆ వీడియో అందులో వుంది.
 
అయితే నటిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌ని అంటూ చెబుతూనే మేం తినేవాటిలో మ‌సాలా త‌క్కువ‌గా వుంటుంద‌ని తెలియ‌జేసింది. ఫిట్‌నెస్‌తోపాటు మ‌నం తినే తిండి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌గా వుండాలంటోంది. మీకు కడుపు నొప్పి ఉంటే, అజ్వైన్ లేదా పెరుగు తినండి.

రోజు మసాలా పదార్థాలను నివారించండి. న‌టిగా ఎంత పారితోషికం తీసుకున్నా ముందు ఆరోగ్య‌మే ముఖ్య‌మని చెబుతోంది. నయనతార, సమంతా అక్కినేని, తమన్నా భాటియా ఇలా చాలామంది ఒక‌ప్పుడు మాన‌సిక స‌మ‌స్య‌కు గుర‌యివారేనంటూ ఉద‌హ‌రించింది. అందుకే పెద్ద‌లు అంటారు మ‌నం తినే తిండే మ‌న ఆలోచ‌న‌లు అని నిజ‌మేగదా.