గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (17:28 IST)

అగ్రస్థానంలో శ్రుతి హాసన్, ఐతే నాకు అలాంటివి వున్నాయంటున్న బ్యూటీ

Shruti Haasan
మ‌హిళ‌కుండే స‌మ‌స్య‌లు నాకూ వున్నాయి. నేను పిసిఒఎస్‌తో బాధపడుతున్నా, ఆందోళనా ఉంది. కాబట్టి సెరోటోనిన్, హ్యాపీ ఎండార్ఫిన్‌లను విడుదల చేయడానికి అలాగే నేను అనుభవిస్తున్న శారీరక నొప్పిని ఎదుర్కోవటానికి పని చేయడం చాలా ముఖ్యం. నా కాళ్ళు, నా చేతులు పేల‌గా వుండేవి. వాటిని బలోపేతం చేయడానికి నేను కృషి చేశా. నా ఆందోళన కోసం, నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. ఇది నాకు నిజంగా సహాయపడింది. మ‌నం మ‌న‌ శరీరాన్ని ప్రేమతో చూడాలి. అది వేరే రకమైన శక్తిని మ‌న‌కు ప్రసరిస్తుంది. నేను ఫిట్‌నెస్‌ను నా దైనందిన జీవితంలో ఒక భాగంగా భావించే చర్యగా భావిస్తాను. ఇప్పుడు నేను దాన్ని ఆస్వాదించాను` అని శుత్రిహాస‌న్ పేర్కొంది.
 
శ్రుతి హాసన్ 2020కుగాను హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఎన్నుకోబడింది. ఈ సంద‌ర్భంగా ఆమె ప‌లు విష‌యాలను వెల్ల‌డించింది. ఇది ఆమెకు మొద‌టిసారికాదు. 2013 లోనూ ఆమె ఎంపికైంది. ఏడేళ్ళ త‌ర్వాత మ‌ర‌లా ఆమె ఎంపికైంది. ఈ సంద‌ర్భంగా ఆమె టైమ్స్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది.
 
- అంతేకాకుండా, ప్ర‌తి మ‌హిళ 30 సంవ‌త్స‌రాలు వ‌స్తేకానీ త‌నేమిటో తెలీదు. ఆత్మ‌విశ్వాసం క‌లిగిన మ‌హిళగా ఎద‌గాలంటే క‌నీసం ఆ వ‌య‌స్సురావాలి. చాలామంది 16నుంచి 50లోపు కూడా సెక్సీగా క‌నిపిస్తారు. కొంద‌రు 60లోనూ క‌నిపిస్తారు. అయితే మ‌హిళ‌లు ఎదుటివారి వ్య‌క్తిత్వాన్ని చూస్తారు. నేను అలానే చూశాను. అందం అనేది ఒక అంశం మాత్ర‌మే కానీ లోప‌ల ఏముందో తెలుసుకోవడానికి టీనేజ్ స‌రిపోదు. న‌న్ను అమ్మ నుంచి నేర్చుకున్నా.
 
- నేను ఒక కళాకారునిగా, మ‌నిషిగా నన్ను నేను మెరుగుపర్చడానికి పని చేస్తూనే ఉండాలనుకుంటున్నాను. అందుకే ఎప్పుడూ నేను ఉల్లాసంగా, కృతజ్ఞతతో ఉన్నాను. దాన్ని అలానే కొనసాగించాల‌నేది నా ల‌క్ష్యం.
 
- నేను పార్టీలను ద్వేషిస్తాను. మంచి వ్య‌క్తుల‌ను ప్రేమిస్తాను. నా కోసం, నా ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా వున్న‌ వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియా సరైన మార్గంగా అనిపించింది. క‌రోనా మహమ్మారి సమయంలో నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను అని చెప్పింది.