సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 మార్చి 2021 (13:58 IST)

గబ్బర్ సింగ్ భామకు కొత్త ప్రియుడు.. "వెస్టెడ్ పైనాపిలా.. రోస్టెడ్ పైనాపిలా"

Shruti Haasan
గబ్బర్ సింగ్ భామ ప్రస్తుతం కొత్త ప్రియుడి ప్రేమలో మునిగి తేలుతోంది. అయితే శృతి హాసన్‌కు ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎప్పుడు బ్రేకప్ అంటుందో ఎవరికి అర్ధం కాదు. గతంలో ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్సలేతో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లకు అతినికి బ్రేకప్ చెప్పింది. ప్రస్తుతం రాపర్, ఇలస్ట్రేటర్, డూడుల్ ఆర్టిస్ట్ గువహతికి చెందిన శంతను హజారికాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. 
 
అంతేకాదు అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు లేని పోని అనుమానాలను కలిగిస్తుంది. ఇటీవల శంతనుని తన తండ్రికి పరిచయం చేసిన శృతి హాసన్ తాజాగా అతని కోసం పైనాపిల్‌తో ప్రత్యేక వంటకం తయారు చేసింది. 
Pineapple
 
అయితే కాస్త ఏమరుపాటు వలన అది మొత్తం మాడిపోయింది. దీనిని చూసిన శంతను .. ''ఇది వెస్టెడ్‌ పైనాపిలా లేక రోస్టెడ్‌ పైనాపిలా'' అంటూ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.