గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 జనవరి 2021 (09:56 IST)

shruti haasan: క్రాక్ హీరోయిన్ శ్రుతి హాసన్ టార్గెట్ అదేనట

సూపర్ స్టార్ కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ 1986 జనవరి 28న జన్మించింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన శ్రుతి ఇటీవలే క్రాక్ చిత్రంలో అదరగొట్టింది. ఆమె హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. నటనతో పాటు, శ్రుతి అవార్డు గెలుచుకున్న ప్లేబ్యాక్ సింగర్ కూడా.
 
శ్రుతి హసన్ బాలీవుడ్లో 'లక్'తో కెరీర్ ప్రారంభించారు. చివరకు 2009లో 'లక్' అని చెప్పే ముందు శ్రుతి హాసన్ అనేక సినిమా ఆఫర్లను తిరస్కరించారు. అయినప్పటికీ 2008లో తమిళ చిత్రాలలో నటించారు. ఐతే సిద్దార్థ్ సరసన అనగానగా ఓ ధీరుడు దర్శకత్వం వహించిన ప్రకాష్ కోవెలముడితో తెలుగు సినిమాలో శ్రుతి తొలిసారిగా అడుగుపెట్టింది. ఈ చిత్రాన్ని విమర్శకులు ప్రశంసించారు. శ్రుతి ప్రేక్షకులను మరియు విమర్శకులను కూడా ఆకట్టుకోగలిగారు. ఆమె నటించిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్ చిత్రం టాలీవుడ్లో ఆమెను టాప్ స్టార్ చేసేసింది.
ఆ కోరిక వుందట
కమల్ హాసన్ కుమార్తెగా కాకుండా శృతిహాసన్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె విజయాలతో దూసుకుపోతోంది. నటిగానే కాకుండా పాటలు పాడటంలోను, కవితలు రాయడంలోను శృతి హాసన్ దిట్ట. అంతేకాదు నిర్మాతగా కూడా మారడానికి ప్రయత్నాలు చేస్తోంది.
 
ఇదంతా ఒక ఎత్తయితే తనకు జీవితంలో సాధించాల్సింది ఒక్కటే ఒక్కటుందని చెబుతోంది శృతిహాసన్. అది కూడా మంచి తల్లి కావడమేనట తన కోరిక. హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేశాను. ఎంతోమందితో పరిచయాలు ఉన్నాయి. స్నేహితులంటారా.. కోకొల్లలు. ఇదంతా ఒకే. అయితే నాకు జీవితంలో ఒకటి సాధించాలన్న తపన ఎప్పటి నుంచో ఉంది.
కొంతమంది ప్రముఖులు గొప్ప తల్లులుగా చరిత్రలో మిగిలిపోతున్నారు. అలా వారిలా ఉండాలన్నది నా ఆలోచన. అందుకే గొప్ప తల్లిగా ఎలా మారాలని ఆలోచిస్తున్నా. అలా మారడం నాకు కష్టంతో కూడుకున్న పనే. అయినా ఖచ్చితంగా శృతి గొప్ప తల్లి అన్న క్యాప్షన్ మీకు వినపడేలా చేస్తాను. ఇదేదో సినిమా క్యాప్షన్ అనుకోరు.. నిజ జీవితంలోనే అంటోంది శృతి. 
 
అది గుర్తొస్తే గుండె కలుక్కుమంటుంది
ప్రేమికులు విడిపోతే ఒక‌రికొక‌రు బాధ ప‌డ‌తారు. కొందరు మ‌ర్చిపోతారు. సినిమా ప్రేమ‌లు ఇలానే వుంటాయ‌ని చాలా మంది అనుకుంటుంటారు. కానీ సినిమా వాళ్ళ‌కు కూడా ప్రేమ‌లు వుంటాయి. కానీ అవి వ్య‌క్తం చేయ‌డానికి స‌రైన స‌మ‌యం రావాలి. చాలామంది హీరోయిన్ల ప్రేమ‌లో ప‌డి త‌ర్వాత విడిపోవ‌డం.. మ‌ర‌లా మ‌రొక‌రిని ప్రేమించ‌డం స‌హ‌జంగా జ‌రుగుతుంటుంది.
కానీ ఒక్కోసారి విడిపోయిన వ్య‌క్తి గురించి చెప్పాలంటే.. బాధ‌గా వుంటుంది. అది నిజమ‌ని... నాయిక శ్రుతిహాస‌న్ చెబుతోంది. చాలామంది హీరోయిన్లు సోష‌ల్ మీడియా వ‌చ్చాక అభిమానుల‌తో త‌న అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు. ల‌వ్‌లో బ్రేక‌ప్‌లు మామూలే. ఇలాంటిదే శ్రుతికి జ‌రిగింది. అది అంద‌రికీ తెలిసిందే.
 
ఇటీవ‌లే తెలుగులో `క్రాక్‌` సినిమాలో హిట్ కొట్టిన ఈ భామ‌... ప్రేమించి పెండ్లి చేసుకున్న భార్య‌గా జీవించింద‌నే చెప్పాలి. ఇటీవ‌లే సోష‌ల్‌ మీడియాలో ఆమెను ఓ అభిమాని.. అడిన ప్ర‌శ్న‌కు చాలా ఓపిక‌గా స‌మాధానం చెప్పింది. ఈ ఏడాదైనా వివాహం చేసుకుంటారా? అని అడిగిన అభిమానితో.. అది గాలివార్త అని కొట్టిపారేసింది.
అయితే మాజీ ప్రియుడు మైకేల్‌ గుర్తుకు వస్తే అస్యహం వేస్తుందా! అని ప్రశ్నిస్తే.. ఏమాత్రం త‌డ‌ప‌డ‌కుండా.. 'మీరు నిజంగా చెడ్డవారు. ఎందుకంటే, నేను ఎవరినీ అస్యహించుకోను. కాబట్టి నా దగ్గర సమాధానం లేదు. అయితే లోలోపల కాస్త బాధపడతాను' అని చాలా క్లారిటీగా సమాధానం చెప్పింది‌. ఇలాంటి అభిప్రాయాలు హీరోయిన్లు స‌హ‌జంగానే చెబుతుంటార‌ని.. అభిమాని అన‌డంతో... మ‌రెందుకు అడిగారంటూ.. తిరిగి రిప్ల‌యి ఇచ్చింది.