ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ ఫిల్మ్ 'క్రాక్' టాకీ పార్ట్ పూర్తి

shruti haasan - raviteja
డివి| Last Modified బుధవారం, 11 నవంబరు 2020 (22:07 IST)
మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్‌' షూటింగ్ ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్త‌యింది. త్వ‌ర‌లో హీరో హీరోయిన్లు ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌పై ఓ పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఆ పాట‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యిన‌ట్లే.

తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న 'క్రాక్‌'లో హీరోయిన్‌గా శ్రుతి హాస‌న్ క‌థ‌కు కీల‌క‌మైన ఓ పాత్ర‌ను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల వారినీ ఆక‌ట్టుకొనే అంశాలు ఉన్నాయి. పేరుపొందిన త‌మిళ న‌టులు స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్లు పోషిస్తున్నారు.

స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. 'మెర్సాల్‌', 'బిగిల్' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ప‌నిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతికి థియేట‌ర్ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

తారాగ‌ణం:
ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి.

సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:
గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌:
బి. మ‌ధు
బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ:
జి.కె. విష్ణు
డైలాగ్స్‌:
సాయిమాధ‌వ్ బుర్రా
స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి
కూర్పు: న‌వీన్ నూలి
ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌
ఫైట్స్‌:
రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
పాట‌లు:
రామ‌జోగ‌య్య శాస్త్రి
పీఆర్వో:
వంశీ-శేఖ‌ర్.దీనిపై మరింత చదవండి :