గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (10:23 IST)

హీరోయిన్లను అలా మార్చుకున్న యష్- ప్రభాస్..!?

బాహుబలి నటులు, కేజీఎఫ్ సినీ నటులతో కలిసి పనిచేస్తున్నారు. ‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోనే ‘సలార్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌ నటిస్తున్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీ సలార్‌కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుంటే.. యష్ సరసన తమన్నా మరో సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా ప్రభాస్ హీరోయిన్ తమన్నా కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్ చేసిన అనుభవంతో మళ్లీ యాష్‌తో కలిసి రొమాన్స్ చేయనుంది. ఇదే తరహాలో ప్రభాస్ కూడా కేజీఎఫ్ హీరోయిన్‌తో స్టెప్పులేయనున్నాడు. 
 
బాహుబలి సినిమాలో మనోహరా స్పెషల్‌ సాంగ్‌ ఉంటే ఓ కనువిందు. ఆ సినిమాలో ప్రభాస్‌తో ఇద్దరు భామలు కలసి స్టెప్పులేశారు. అలా మనోహరా.. పాట ఐటమ్‌ సాంగ్‌ ప్రియులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ప్రభాస్‌ నటిస్తున్న ప్యాన్‌ ఇండియా మూవీ ‘సలార్‌’లోనూ ఓ ప్రత్యేక పాట ఉందని సమాచారం. అయితే ఇందులో ఇద్దరు కాకుండా ప్రభాస్‌తో ఒకే ఒక్క బ్యూటీ కాలు కదుపుతారట. ఆ బ్యూటీ ఎవరంటే ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ శ్రీనిధీ శెట్టి అని సమాచారం. 
yash
 
శ్రీనిధి డ్యాన్సింగ్‌ స్కిల్‌ గురించి ఆయనకు తెలిసి ఉంటుంది కాబట్టి ‘సలార్‌’లో ప్రత్యేక పాటకు తీసుకోవాలనుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలా యష్ హీరోయిన్ ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తే.. బాహుబలి హీరోయిన్ తమన్నా యష్ సరసన హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. మరి ఈ వార్తల్లో ఎంతటి వరకు నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.