మంచు తెరలపై ప్రేమ : "రాధేశ్యామ్" నుంచి ఆసక్తికర పోస్ట్ (Video)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నార. కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ చిత్రం నుంచి మరో ఆకర్షణీయమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇటీవలే ఈ చిత్రం టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. దీన్ని చూస్తే ప్రభాస్ లవర్ బాయ్‌గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, గతంలో ప్రభాస్ మిస్టర్ పర్‌ఫెక్ట్, డార్లింగ్ వంటి చిత్రాల్లో లవర్‌బాయ్ పాత్రలో నటించిన విషయం తెల్సిందే.
ఈ వింటేజ్ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్ లవర్‌బాయ్‌గా సాఫ్ట్ లుక్‌లో విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్‌కు జోడీగా పూజాహెగ్డే.. ప్రేరణగా మెప్పించనున్నారు. ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తున్నారు.
దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ రోజు శివరాత్రి సందర్భంగా మూవీ నుండి ఆసక్తికర పోస్టర్ విడుదల చేశారు. ఇది నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.