1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (14:22 IST)

"పోటుగాడు" హీరోయిన్‌కు లక్కీ ఛాన్స్!

Simran kaur
కొందరు హీరోయిన్లకు వరుస ఆఫర్లు వస్తుంటాయి. మరికొందరికి చాలా గ్యాప్ వస్తుంది. హీరోయిన్ సిమ్రన్ కౌర్ విషయంలో కూడా అదే జరిగింది. మంచు మనోజ్ హీరోగా నటించిన 'పోటుగాడు' సినిమా ద్వారా ఈ చిన్నది అప్పట్లో టాలీవుడ్‌కి పరిచయం అయింది. 
 
అయితే, ఆ సినిమా ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. అందుకే ఆ వెంటనే టాలీవుడ్ నుంచి ఆఫర్లు రాలేదు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత సిమ్రన్ కు మళ్లీ తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అది కూడా ప్రభాస్ సినిమా కావడం విశేషం!
 
ప్రస్తుతం కె.రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' పేరిట ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి విదితమే. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 
 
ఈ చిత్రంలో సిమ్రన్ కౌర్ ఓ ముఖ్య పాత్ర పోషించింది. దీని గురించి 'ఈ చిన్నది చెబుతూ, ఆమధ్య 'రాధేశ్యామ్' టీమ్ నుంచి కాల్ వచ్చింది. ఓ క్యారెక్టర్ వుంది చేస్తారా? అని అడిగారు. వెంటనే ఒప్పేసుకున్నాను. ఇందులో నాది కీలమైన మంచి పాత్ర, ఇందులో నటించినందుకు హ్యాపీగా వుంది' అని చెప్పింది.