శనివారం, 22 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 21 నవంబరు 2025 (19:24 IST)

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

Ganja Plants
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసగా మారినవారు ఎంతకైనా తెగిస్తారని చెబుతుంటారు వైద్య నిపుణులు. సమయానికి మత్తు కోసం ఏమైనా చేస్తుంటారు. తెలంగాణ లోని నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లి గ్రామంలో గంజాయికి బానిసైన మధు అనే యువకుడు ఏకంగా ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచేసాడు.
 
మధు ఇంటి వెనుక పెరట్లో ఏదో మొక్క తేడాగా కనిపించడంతో స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకునివెళ్లారు. మధు ఇంటికి వచ్చిన పోలీసులు ఇంటి ఆవరణలో వున్న గంజాయి మొక్కలను చూసి షాక్ తిన్నారు. కాగా తను గంజాయి బానిస కావడంతో ఆ పని చేసినట్లు సదరు యువకుడు పోలీసులకు వెల్లడించాడు.