వకీల్‌సాబ్ సెకండాఫ్‌లో స్పెషల్ గిఫ్ట్ చిరంజీవేనా!
పవన్‌కళ్యాణ్ సాంగ్ పాడితే ఎలా వుంటుంది. `వకీల్‌సాబ్`లో సాంగ్ పాడడానికి ప్రయత్నం చేశాడు సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్. కానీ కుదరలేదంటున్నాడు. కానీ సెకండాఫ్‌లో సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఒకటి వుంటుందని అంటున్నాడు. అదేంటి పాట అంటే మీరే చూడండి వచ్చనెల 9న అంటున్నాడు. అసలు పవన్‌కళ్యాణ్‌తో గబ్బర్‌సింగ్‌కే చేయాల్సింది. కానీ సాధ్యపడలేదని అంటున్నాడు. వివరాల్లోకి వెళితే, లాక్‌డౌన్ వల్ల ఏడాదిపాటు వకీల్‌సాబ్‌తో జర్నీ చేశాను. కమర్షియల్ సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటినుంచో అనిపించింది.`మిరపకాయ్` సినిమా చేస్తుండగానే `గబ్బర్‌సింగ్`కు అవకాశం వచ్చింది. కానీ చెప్పలేని చిన్న డిలే వల్ల మిస్ అయింది. అప్పటినుంచి ఎదురుచూస్తుండగా అనుకోకుండా `జనసేన` పార్టీకి చెందిన మూడు పాటలకు ట్యూన్ చేయాల్సివచ్చింది థమన్‌కు. రామజోగయ్యశాస్త్రి రాసిన పాటలకు బాణీలు బాగున్నాయని పవన్ అభినందించారు.
ఇది జరిగి కొద్దిరోజుల తర్వాత పారిస్‌లో `సామజవరగమన..`పాట బేక్‌గ్రౌండ్ కంపోజ్ చేస్తుండగా దర్శకుడు త్రివిక్రమ్‌గారే థమన్‌ను వకీల్‌సాబ్‌కు తీసుకోమని దిల్‌రాజుకి చెప్పడం జరిగింది. షూర్, అయనైతే ఇంకా బెటర్ అని అప్పుడు థమన్‌ను తీసుకోవడం జరిగింది. విచిత్రం ఏమంటే, ఈ సినిమాలో పవన్‌చేత పాట పాడించాలని చూశారు. కానీ కుదలేదని థమన్ అంటున్నాడు. కానీ సెకండాఫ్‌లో సర్‌ప్రైజ్ వుంటుందన్నాడు. మరి అందులో ఏదైనా పాటవుంటే అందులో చిరంజీవి ప్రత్యక్షమవుతాడా! అనే అనుమానం కలుగుతోంది. అది తెరపై చూడాల్సిందేని థమన్ చెబుతున్నాడు. మరో విశేషం ఏమంటే, పవన్‌తో అయ్యప్ప కోషియం రీమేక్ చేయనున్నారు. ఆ సినిమాకూ థమన్ సంగీత దర్శకుడుగా ఫిక్స్ అయ్యాడు. సో. వన్ ప్లస్ వన్ ఆఫర్‌గా థమన్ దక్కిందన్నమాట.