బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 30 జనవరి 2021 (15:44 IST)

కొత్త బాయ్‌ఫ్రెండుతో శ్రుతి హాసన్, ఎయిర్‌పోర్టులో అంతా చూస్తుండగానే వాటేసుకుంది

శ్రుతి హాసన్. ఇటీవలే ప్రేమ విఫలం గురించి తన గుండె కలుక్కుమంటుంది అని చెప్పింది ఓ ఇంటర్వ్యూలో. ఐతే తాజాగా తన 35వ పుట్టినరోజు నాడు కొత్త స్నేహితుడిని పరిచయం చేసింది. ముంబై వీధుల్లో అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఆమె పుట్టినరోజు వేడుకలను అతడు దగ్గరుండి జరిపించాడు. ఇంతకీ అతడు పేరు ఏమిటంటే.. శంతను హజరిక.
 
పుట్టినరోజు వేడుకలు ముగించుకుని ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్ చిత్రంలో నటించేందుకు హైదరాబాద్ వచ్చింది. అక్కడికి కూడా శంతను వచ్చాడు.

విమానాశ్రయం దగ్గర ఆమెకి సెండాఫ్ ఇస్తుండగా శ్రుతి ఏదో మర్చిపోయినట్లు వెనక్కి తిరిగి వచ్చింది. అతడు ఆమె వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి ఏదో వస్తువు ఆమెకి ఇచ్చాడు. వెంటనే అంతా చూస్తుండగానే అతడిని కౌగలించుకుంది శ్రుతి హాసన్. ప్రస్తుతం శ్రుతి, శంతనుల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.