అతనితో రెచ్చిపోయిన మోనాల్!
నటి మోనాల్ గజ్జల్.. సుడిగాడు సినిమా తర్వాత తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత కొంతకాలం మలయాళం వైపు మళ్ళింది. అక్కడ కొన్ని సినిమాలు చేస్తుంది. అందులో పున్నమినాగు సినిమా కూడా వుంది. తిరిగి చాలా కాలం తర్వాత తెలుగు బిగ్‌బాస్ సీజన్4లో కనిపించింది. అందులో పిచ్చాపాటీ పాడుతూంగా.. ప్రేమికుల గురించి చర్చ వచ్చినప్పుడు `ఎ` అనే పేరును మాత్రమే చెప్పేది.
తాను నిజంగానే ప్రేమలో పడ్డానని తెలియజేసింది. మొదట్లో.. ఎ.. అంటే అఖిల్ అనుకున్నారు.. కానీ తాజాగా ఆమె మలయాళ హీరో ఆర్యన్‌తో ప్రేమలో పడినట్లు తెలిసింది. ఆయనతో `డ్రాకులా` సినిమా చేసింది. అందులో కొన్ని సన్నివేశాలలో శృంగారాన్ని ఒలకపోస్తూ.. జీవించిందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె ఆర్యన్‌తోనే ప్రేమను కొనసాగిస్తుంది. మధ్యలో కొంతకాలం ఇద్దరికీ గ్యాప్ వచ్చిందని తెలిసింది. కానీ.. తాజాగా బిగ్‌బాస్ తర్వాత.. తెలుగులో ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆర్యన్ పేరు చెప్పింది. అయితే త్వరలో వీరిద్దరు ఒకటి కావాలని ఆశిద్దాం.