శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డివి
Last Modified: మంగళవారం, 19 జనవరి 2021 (19:09 IST)

అత‌నితో రెచ్చిపోయిన మోనాల్‌ గజ్జర్

న‌టి మోనాల్ గ‌జ్జ‌ల్‌.. సుడిగాడు సినిమా త‌ర్వాత తెలుగులో ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఆ త‌ర్వాత కొంత‌కాలం మ‌ల‌యాళం వైపు మ‌ళ్ళింది. అక్క‌డ కొన్ని సినిమాలు చేస్తుంది. అందులో పున్న‌మినాగు సినిమా కూడా వుంది. తిరిగి చాలా కాలం త‌ర్వాత తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్‌4లో క‌నిపించింది.
 
అందులో పిచ్చాపాటీ మాట్లాడుతూ.. ప్రేమికుల గురించి చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు `ఎ` అనే పేరును మాత్ర‌మే చెప్పేది. తాను నిజంగానే ప్రేమ‌లో ప‌డ్డాన‌ని తెలియ‌జేసింది. మొద‌ట్లో.. ఎ.. అంటే అఖిల్ అనుకున్నారు.. కానీ తాజాగా ఆమె మ‌ల‌యాళ హీరో ఆర్య‌న్‌తో ప్రేమ‌లో ప‌డిన‌ట్లు తెలిసింది. ఆయ‌నతో `డ్రాకులా` సినిమా చేసింది. అందులో కొన్ని స‌న్నివేశాల‌లో శృంగారాన్ని ఒల‌క‌పోస్తూ జీవిచింద‌ని తెలుస్తోంది.
 
ప్ర‌స్తుతం ఆమె ఆర్య‌న్‌తోనే ప్రేమ‌ను కొన‌సాగిస్తుంది. మ‌ధ్య‌లో కొంత‌కాలం ఇద్ద‌రికీ గ్యాప్ వ‌చ్చింద‌ని తెలిసింది. కానీ.. తాజాగా బిగ్‌బాస్ త‌ర్వాత‌ తెలుగులో ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆర్య‌న్ పేరు చెప్పింది. అయితే త్వ‌ర‌లో వీరిద్ద‌రు ఒక‌టి కావాల‌ని ఆశిద్దాం.