కూతురిపై తండ్రి అత్యాచారం.. అబార్షన్.. చెల్లెలిపై కూడా ఇదే జరగడంతో..?

woman victim
woman victim
సెల్వి| Last Updated: మంగళవారం, 19 జనవరి 2021 (09:09 IST)
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన హర్యానాలోని హిస్సార్‌లో చోటుచేసుకుంది. రక్తం పంచుకొని పుట్టిన కూతురని కూడా చూడకుండా విచక్షణ కోల్పోయి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 17 ఏళ్ల బాలికపై కన్నతండ్రే ఏడేళ్లుగా లైంగికదాడికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. ఓ ప్రభుత్వ ఉద్యోగి వద్ద వంటమనిషిగా పనిచేస్తున్న తన తండ్రి గత ఏడేళ్లుగా తనపై లైంగికదాడికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని తెలిపింది.

పలుమార్లు గర్భం రావడంతో అబార్షన్‌ చేయించాడని వాపోయింది. ఆ తర్వాత తన అక్క ఇంటికి కొన్నాళ్లపాటు వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి తన చెల్లెల్ని వేధించడం ప్రారంభించాడని పేర్కొంది.

దీంతో భరించలేని ఆ బాలిక తల్లికి ఈ విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.దీనిపై మరింత చదవండి :