సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (15:06 IST)

ఫ్రెండే కదా నమ్మి వెంట నడిస్తే.. నలుగురితో అత్యాచారం చేయించాడు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. స్నేహితుడని నమ్మి వెళ్లిన ఓ యువతి నలుగురు కామాంధులు లైంగికదాడికి తెగబడ్డారు. మిగిలిన మరో నలుగురితో నమ్మిన స్నేహితుడే ఉసిగొల్పిమరీ అత్యాచారం చేయించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలికి చెందిన ఓ యువతి స్థానికంగా ఓ యువకుడో ఎప్పటి నుంచో స్నేహం చేస్తూ వచ్చింది. దీంతో అతను ఎక్కడకు పిలిచినా వెంటవెళ్లేది. ఈ క్రమంలో ఆ యువకుడు మాత్రం ఆ యువతిపై కన్నేశాడు. అతనిలో ఆమెను శారీరకంగా వాడుకోవాలన్న కోరిక ఉండేది. దీన్ని ఆ యువతి పసిగట్టలేక పోయింది. 
 
ఈ క్రమంలో తన స్నేహితుడు పిలిచాడని వెంట వెళ్లింది. ఆ తర్వాత అతనిపై ఆ యువతి పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తన నలుగురు స్నేహితులనూ ఆమెపైకి ఉసిగొల్పాడు. 
 
ఒకరి తర్వాత ఒకరు ఆమెపై దాష్టీకానికి పాల్పడ్డారు. చేసిన పాడు పనిని వీడియో తీసి నెట్‌లో పెట్టి వైరల్ చేశారు. ఆ వీడియోను అడ్డం పెట్టుకుని యేడాది పాటు ఆమెను చిత్రవధ చేశాడు. పదేపదే అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు.
 
ఈ క్రమంలో కొత్త సంవత్సరం ప్రారంభ రోజున ఆ అమ్మాయి స్నేహితుడు చేదు కలగా మిగిల్చాడు. వీడియోలు, ఫొటోలను నెట్‌లో పెట్టడం.. అవి ఇంటి దాకా చేరడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... పరారీలో ఉన్న ఐదుగురు కామాంధుల కోసం గాలిస్తున్నారు. అలాగే, వీడియోలను ఫార్వర్డ్ చేసిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు.