సంబంధిత వార్తలు
- శ్రీకృష్ణ పరమాత్ముడు నెమలి ఫించాన్ని తలపై ఎందుకు ధరిస్తాడు?
- తమిళనాడు గవర్నర్‌గా రెబల్ స్టార్ కృష్ణంరాజు..?!
- కాలేజీ విద్యార్థినిలకు ప్రేమ పేరుతో వల.. ఫాంహౌస్‌కు తీసుకెళ్లి అత్యాచారం!
- విగ్రహాలను ధ్వంసం చేసిన వారి చేతులు ఖండించాలి : హీరో బాలకృష్ణ
- నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే.. మంత్రి నానికి బాలయ్య వార్నింగ్
బాలికకు 14 యేళ్లు... అతనికి 40 యేళ్లు - లొంగదీసుకుని శీలాన్ని దోచుకున్నాడు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో దారుణం జరిగింది. ఓ 14 యేళ్ల మైనర్ బాలికపై కన్నేసిన 40 యేళ్ళ వ్యక్తి ఆమె శీలాన్ని దోచుకున్నాడు. అభంశుభం తెలియని ఆ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత బాలికపై ప్రతి రోజూ అత్యాచారం చేస్తూ పైశాచికానందం పొందుతూ వచ్చాడు.
ఈ క్రమంలో ఆ బాలిక అస్వస్థతకు లోనుకావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారానికి గురైనట్టు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి పేరు ఆంటోని. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ కామాంధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మరోవైపు, కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మందలించారని నీలం రాహుల్ (18) అనే యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాహుల్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
గురువారం రాత్రి తన స్నేహితుని అన్న పెళ్లి ఊరేగింపుకు వెళ్లిన రాహుల్‌ను ఆలస్యం కావడంతో ఫోన్లో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్థాపం చెందిన రాహుల్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
