శ్రీకృష్ణ పరమాత్ముడు నెమలి ఫించాన్ని తలపై ఎందుకు ధరిస్తాడు?
శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో కేవలం సరససల్లాపాలు మాత్రమె చేసాడు. అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు. అంతవరకే కానీ ఏనాడూ ఆయన అతిక్రమించలేదు. కృష్ణుడు, గోపికల మధ్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగిగా కనిపించే యోగి.
ఇక నెమలి ఫించం విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి నెమలి. పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు. అందుకే నెమలి ఫించం తలపై ఉండి శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.