బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 11 డిశెంబరు 2020 (23:36 IST)

శ్రీకృష్ణ పరమాత్మ ధరించే శంఖం విశిష్టత ఏమిటో తెలుసా?

శ్రీ కృష్ణ పరమాత్మ ధరించే శంఖం పాంచజన్యం. ఈ పాంచజన్యం విశిష్టత గురించి చాలా సందర్భాల్లో చెప్పబడింది. ఇప్పుడు మనం దీని గురుంచి తెలుసుకుందాం. పాంచజన్యం ప్రత్యేకత ఏమిటంటే ఒక శంఖంలో మరో నాలుగు శంఖాలు వుంటాయి.

సహజంగా వేయి శంఖాలలో ఒకటి  మాత్రమే దక్షిణావర్త శంఖం ఉద్భవిస్తుంది. వాటిలో ఒక శంఖం గోమడి శంఖం. నూరు లక్షల గోమడి శంఖాలలో ఒక శంఖం పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుంది.
 
అంతటి మహిమాన్వితమైన, పవిత్రమైన శంఖాన్ని దర్శించడమే పరమ పవిత్రమని పురాణాల్లో చెప్పబడింది. ఈ రకమైన మహిమాన్వితమైన పాంచజన్య శంఖం మైసూరు లోని చాముండేశ్వరి దేవి ఆలయంలో వున్నది. ఈ శంఖాన్ని మైసూరు సంస్థానాధీశులు చాముండేశ్వరీ దేవికి కానుకగా సమర్పించారు. అమ్మవారి ఆరాధనోత్సవాలలో ఈ విశేష శంఖాన్ని ఉపయోగిస్తారు.