గురువారం, 6 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-11-2025 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం.. ఎవరికి?

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. పొదుపు, పథకాలపై దృష్టి సారిస్తారు. పనులు వేగవంతమవుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త వాగ్వాదాలకు దిగవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనుకున్నది సాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. మీ సిఫార్సుతో ఒకరి సదవకాశం లభిస్తుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. అర్హులకు చక్కని సలహాలిస్తారు. పదవుల స్వీకరణకు అనుకూలం. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. దుబారా ఖర్చులు అధికం. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీంతో తీరిక ఉండదు. సంప్రదింపులు ఫలిస్తాయి. కావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. కీలక పత్రాలు అందుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాగ్వాదాలకు దిగవద్దు, దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ రోజు కలిసివచ్చే సమయం. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ప్రముఖులను ఆకట్టుకుంటారు. సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఖర్చులు విపరీతం సేవాసంస్థలు, ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీక్షకులపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు సామాన్యం. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదములు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు సామాన్యం, పనులు హడావుడిగా సాగుతాయి. ప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం, అవకాశాలు చేజారిపోతాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతాడు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. అతిగా ఆలోచింపవద్దు, ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలకు ధనం సర్దుబాటవుతుంది. జూదాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మంచి చేయబోతే చెడు ఎదురువుతుంది. దుబారా ఖర్చులు విపరీతం, అన్యమనస్కంగా గడుపుతారు. ఓర్పుతో శ్రమించిన గాని పనులు పూర్తికావు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆపన్నులను ఆదుకుంటారు. ఇతరుల విషయాల్లో మీ జోక్యం అనివార్యం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 1వ పాఠం, ఉత్తరాబాద్ర, రేవతి
రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం ముఖ్యల కలయిక వీలుపడదు. దంపతులు మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.