బుధవారం, 5 నవంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-11-2025 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పనులు అనుకున్న విధంగా సాగవు. ప్రతి విషయానికి ఆందోళన చెందుతారు. అయినవారితో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు విపరీతం, విలువైన వస్తువులు జాగ్రత్త, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. ఖర్చులు విపరీతం. అతిగా ఆలోచింపవద్దు. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. కొత్తవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. పెద్దలను సంప్రదించండి. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. సేవ, దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. కొంతమొత్తం. పొదుపు చేయగలుగుతారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఆభరణాలు, నగదు జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభవార్త వింటారు. మీ కష్టం ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పనులు హడావుడిగా. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆలయాలకు విరాళాలు, కానుకలు అందిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలను అధిగమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఖర్చులు సామాన్యం, పనులు చురుకుగా సాగుతాయి. అనవసర జోక్యం తగదు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం, ఖర్చులు అధికం. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆస్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ధనసమస్య ఎదురవుతుంది.. ఆత్మీయులను కలుసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు, కీలక పత్రాలు అందుకుంటారు. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రావలసిన ధనం సమయానికి అందదు. నిస్తేజానికి లోనవుతారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. చేపట్టిన పనులు సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వేడుకకు హాజరవుతారు. ప్రయాణం చికాకు పరుస్తుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు పురోగతిన సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పనులు చురుకుగా సాగుతాయి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాగ్దాటితో నెట్టుకొస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఆపన్నులకు సాయం అందిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.