మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 5 ఆగస్టు 2020 (22:32 IST)

మహాభారత యుద్ధం: శ్రీకృష్ణుడు తిన్న శనగలతో చనిపోయే సైనికుల లెక్క

మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది సైనికులు, ప్రభువులు పాల్గొన్నారు. ఈ యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. కాగా యుద్ధంలో ఇరు పక్షాలకు ఆహారాన్ని సరఫరా చేసే బాధ్యతను ఉడుపి రాజు తీసుకున్నాడు. ఐతే ప్రతిరోజూ వేలాది మంది మరణించినప్పుడు, సాయంత్రం భోజనం ఖాతాల నుండి ఎలా తయారైంది అనే ప్రశ్న తలెత్తడం సహజమే. మరోవైపు మహాభారత యుద్ధంలో 45 లక్షలకు పైగా సైనికులు పాల్గొన్నారు.
 
శ్రీ కృష్ణుడి ఆదేశానుసారం ఆహార నిర్వహణను ఉడిపిరాజు చేపట్టారు. ఐతే ఇన్నివేల మందికి భోజనాన్ని ఖచ్చితంగా ఎలా తయారుచేయడం అనే సందేహం ఉడిపి రాజుకు తలెత్తింది. రాజులో తలెత్తిన ప్రశ్నకు శ్రీ కృష్ణుడు పరిష్కరించాడు. శ్రీకృష్ణుడు రోజూ ఉడికించిన శనగలు తినేవాడు.
 
కృష్ణుడు వెళ్లిపోయాక ఆయన తిన్న శనగలు తాలూకు తొక్కులు ఎన్ని వున్నాయో లెక్కించేవాడు ఉడిపిరాజు. కృష్ణుడు 10 శనగలు తింటే, మరుసటి రోజు 10,000 మంది సైనికులు చంపబడతారని తను అర్థం చేసుకున్నాడు. అలా శ్రీ కృష్ణుడి వల్ల, ప్రతిరోజూ సైనికులు పూర్తి ఆహారం పొందేవారు. అదేసమయంలో ఎంతమాత్రం ఆహారం మిగిలేది కాదు.