శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: బుధవారం, 22 జులై 2020 (18:49 IST)

దటీజ్ కేసీఆర్..! ఈ ఒక్క ఫోటో చాలు.. కేసీఆర్ అంటే ఏంటో చెప్పడానికి..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్... దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు, వాళ్ల కుటుంబాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. వాళ్లని ఎంతగా గౌరవిస్తారో తెలిసిందే. ఈరోజు జరిగిన సమావేశం మరోసారి కేసీఆర్ మంచితనాన్ని.. అమరవీరుల ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎంతగా ఆదరిస్తారో తెలిసింది.
 
ఇంతకీ ఏం జరిగిందంటే... ఈ రోజు అమర జవాను కుటుంబ సభ్యులను కలిసారు. పైన ఫోటోలో చూపించిన మార్కింగ్‌లో ఉన్న రెండు కుర్చీల్లో గతంలో ఎప్పుడు కూడా ఇతరులు కూర్చోలేదు. 
 
ఆ కుర్చీల్లో సీఎం లేదా... సీఎం‌ని కలవడానికి వచ్చిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర దేశాల ప్రతినిధులు కూర్చునేవారు. అంతేతప్ప వేరేవారెవరూ కూర్చోలేదు.
 
అయితే... దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబ సభ్యులను ఆ కూర్చిలో కూర్చోబెట్టి సీఎం కేసీఆర్ మాములు కుర్చీలో కూర్చున్నారు. వారిని ఆయన కూర్చునే కుర్చీలో కూర్చోబెట్టారు. నిజంగా... దటీజ్ కేసీఆర్ అనిపించారు.