శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (17:21 IST)

పవన్‌కు పెళ్లి ఇన్విటేషన్ ఇచ్చిన నితిన్..

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వివాహం జరునుంది. కరోనా మహమ్మారి కారణంగా గత కొన్నాళ్లుగా నితిన్ వివాహం వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వ నియమాలు, నిబంధనలతో అతి తక్కువ మంది బంధువుల మధ్య వివాహం చేసుకోటానికి నితిన్ రెడీ అయ్యాడు. 
 
దీంతో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కొద్దిమంది సమక్షంలో ఈ నెల 26న నితిన్ వివాహం జరగబోతోంది. అయితే తన పెళ్లికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఇటీవల ఆహ్వానించిన నితిన్ అలాగే తన అభిమాన నటుడు పవన్‌ కళ్యాణ్‌ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించాడు. 
 
పవన్‌తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, మెగా హీరో వరుణ్ తేజ్‌లకు కూడా ఇన్విటేషన్ అందిందట. నితిన్ చదువుకునే రోజుల నుంచే పవన్ కళ్యాణ్‌ను పిచ్చి పిచ్చిగా అభిమానించేవాడని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.