శనివారం, 23 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 18 ఆగస్టు 2025 (22:54 IST)

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

A man put his phone out of a moving train to take a selfie
సెల్ఫీల పిచ్చి ఎంతోమందిని సమస్యల్లోకి నెట్టివేస్తుంది. కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. మరికొందరు తమ సెల్ ఫోన్లతో పాటు గాయాలపాలవుతున్నారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
 
ఆ వీడియోలో ఓ వ్యక్తి వేగంగా కదిలి వెళ్తున్న రైల్లో నుంచి సెల్ఫీ తీసుకుంటున్నాడు. అతడలా సెల్ఫీ తీయడాన్ని పక్క రైలు బోగీలో వున్న మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. రైలు చాలా వేగంగా వెళ్తోంది. ఇంతలో రైల్వే ట్రాక్ పక్కనే వున్న ఓ వ్యక్తి కర్ర పట్టుకుని రెల్లో సెల్ఫీ తీసుకుంటున్న వ్యక్తి చేతిపై ఒకే ఒక్క దెబ్బ వేసాడు. అంతే... చేతిలో నుంచి సెల్ ఫోన్ జారి కింద పడిపోయింది.
 
ఫోన్ కిందపడిపోవడంతో వేగంగా వెళ్తున్న రైల్లోని వ్యక్తి లబోదిబోమంటూ కనిపించాడు. సెల్ఫీ పిచ్చి ఆ విధంగా ఫోన్ పోయేలా చేయడమే కాకుండా గాయాన్ని కూడా మిగిల్చింది.