శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 జూన్ 2020 (13:30 IST)

భారత సైనికుల త్యాగాలు మరువలేనివి: నాట్స్

సెయింట్ లూయిస్: భారత సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడి అసువులు బాసిన భారతీయ సైనికులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నివాళులు అర్పించింది. 20 మంది సైనికులు చేసిన ప్రాణాత్యాగాన్ని భారతీయులెవ్వరూ మరిచిపోలేనిదని నాట్స్ పేర్కొంది.
 
సైనికుల మృతి పట్ల తన సంతాపాన్ని వెలిబుచ్చింది. సైనికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది. భారతీయులు ఎక్కడ ఉన్నా భారత సైన్యానికి తమ మద్దతు ఉంటుందని తెలిపింది.