శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 29 మే 2020 (22:43 IST)

డాలస్‌లో అగ్నిమాపక సిబ్బందికి నాట్స్ సాయం

డాలస్: అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం.. కరోనా విలయతాండం చేస్తున్న వేళ.. కరోనాపై ముందుండి పోరాడే వారికి తన వంతు సాయం చేసేందుకు విస్తృతంగా కృషి చేస్తోంది. తాజాగా డాలస్‌లోని అగ్నిమాపక సిబ్బందికి నాట్స్ ఉచితంగా ఆహారపంపిణీ చేసింది.
 
నాట్స్ ఉపాధ్యక్షుడు బాపు నూతి.. స్థానిక అగ్నిమాపక అధికారి జాన్సన్‌ను కలిసి నాట్స్ ఆహార పంపిణీ చేసే ప్రతిపాదన ముందుంచారు. దీనికి జాన్సన్ అంగీకరించడంతో 50 మంది సిబ్బందికి నాట్స్ ఆహార పంపిణీ చేసింది. నాట్స్ సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఫైర్ స్టేషన్ కెప్టెన్ జాన్సన్ ప్రశంసించారు. ఈ ఆహార పంపిణీలో పాల్గొన్న నాట్స్ సభ్యులందరిని నాట్స్ నాయకత్వం అభినందించింది.