డాలస్‌లో నిరాశ్రయులకు ఆహారపంపిణీ చేసిన నాట్స్
డాలస్: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న నాట్స్ కరోనా కష్టకాలంలో నిరాశ్రయులైన వారికి కూడా తన చేయూత అందిస్తోంది. తాజాగా డాలస్ నాట్స్ 100 మందికి ఆహారాన్ని పంపిణీ చేసింది.
నాట్స్ యూత్ టీం సభ్యురాలైన సంజనా కలిదిండి ఇందుకు కావాల్సిన సాయం చేసింది. శాన్ఎంటానియో ప్రాంతంలో నిరాశ్రయులైన పేదలకు, చిన్నారులకు ఈ ఆహారాన్ని అందించడం జరిగింది. సంజనా చేసిన సాయాన్ని నాట్స్ నాయకత్వం ప్రశంసించింది.