చైనా ఆర్మీ తీరుపై అమరవీరుల సైనికుల కుటుంబాల ఆగ్రహం?
ఈ నెల15వ తేదీన లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ వద్ద భారత్ - చైనా దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో భారత్ వైపు నుంచి 20మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. అలాగే, చైనా తరపున కూడా అనేకమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
కానీ, కమాండర్ ఆఫరీసర్, మరికొంతమంది మాత్రమే ప్రాణాలు కోల్పోయినట్టు చైనా ప్రకటించింది. మరి కొంత మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఆ ఘర్షణలో చైనా ఇప్పటికీ మృతుల వివరాలు తెలపకపోవడం గమనార్హం. దీంతో చైనా ప్రభుత్వ తీరుపై ఆ సైనికుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వ్యవహరిస్తోన్న ఈ తీరుపై మృతుల కుటుంబ సభ్యులు అసంతృప్తితో ఉన్నారని అమెరికా కేంద్రంగా నడిచే బ్రీట్‌బార్ట్ న్యూస్ తెలిపింది. వెయిబోతో పాటు చైనాకు చెందిన పలు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయా సైనికుల కుటుంబ సభ్యులు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నట్లు బ్రీట్‌బార్ట్ న్యూస్ ఎడిటర్ ఓ కథనంలో పేర్కొన్నారు.
జూన్ 15న జరిగిన ఘర్షణలో 20 మంది తమ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత్ ప్రకటించింది. అదే సమయంలో చైనా వైపున కూడా భారీగా ప్రాణ నష్టం జరిగిందని చెప్పింది. చైనా మాత్రం ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేయలేకపోతోంది.
ఇప్పటివరకు మృతి చెందిన అతి కొద్ది మంది ఆఫీసర్ల పేర్లే ప్రకటించింది. ఈ విషయంపై మృతి చెందిన చైనా సైనికుల కుటుంబాలు సామాజిక మాధ్యమాల ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని ఆ కథనంలో పేర్కొని చైనా తీరుని బ్రీట్‌బార్ట్ న్యూస్ ఎండగట్టింది.